'రాధా మాధవీయం' నవలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు ప్రముఖ రచయిత విజయకుమార్ గడియా రచించిన 'రాధా మాధవీయం' నవలను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయకుమార్ గడియా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, తన తాజా రచనను అందజేశారు. నవలను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ.... తెలుగు సాహిత్యానికి రచయితలు అందిస్తున్న సేవలు సమాజానికి ఎంతో విలువైనవని పేర్కొన్నారు. మంచి రచనలు పాఠకుల్లో ఆలోచనను రేకెత్తించడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తాయని అన్నారు. 'రాధా మాధవీయం' వంటి సాహిత్య రచనలు పాఠకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.రచయిత విజయకుమార్ గడియా మాట్లాడుతూ.... తన రచనను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. సాహిత్యానికి ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం లభించడం రచయితలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. నవలలోని అంశాలు పాఠకులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయని వివరించారు. నవల ఆవిష్కరణ సందర్భంగా రచయితను ఎమ్మెల్యే అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ రచనలు అందించాలని ఆకాంక్షించారు.