ఏ పి సాఫ్ట్బాల్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా పి. షణ్ముగం నియామకం
చిత్తూరు జూలై 11
ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా పి.షణ్ముగం నియమితులయ్యారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్కు అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
జూలై 8న విజయవాడలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో
పి.షణ్ముగం పేరును వైస్ చైర్మన్ పదవికి ప్రతిపాదించగా, అనుబంధ జిల్లా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
రాష్ట్రవ్యాప్తంగా సాఫ్ట్బాల్ క్రీడ అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడం, వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో పి.షణ్ముగం చేసిన సేవలు, సమర్థవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా శనివారం ఈ నియామకం చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా పి.షణ్ముగం మాట్లాడుతూ రాష్ట్రంలో సాఫ్ట్బాల్ క్రీడకు మరింత ప్రోత్సాహం అందించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు కృషి చేస్తానన్నారు.
ఆయన నియామకంపై క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్బాల్ క్రీడ అభివృద్ధికి ఆయన సేవలు ఎంతో ఉపయోగపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.