గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ..
పత్రికా ప్రకటన
తేదీ: 09.07.2026
అన్నమయ్య జిల్లా - మదనపల్లి
గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ..
జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ గారు, ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు, సంయుక్తంగా గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు బాధితులతో నేరుగా మాట్లాడి పోలీసు సేవలపై ఆరా తీశారు.
మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోక్సో, బాల్య వివాహాల నివారణ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచి,బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
మహిళా పోలీసులు (GMSK) ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, బాధితుల సమస్యలను వేగంగా పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
గ్రామాలు, విద్యాసంస్థల్లో పర్యటిస్తూ మహిళా చట్టాలు, రక్షణ మార్గాలపై ప్రజలకు, విద్యార్థినులకు నిరంతరం అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.