🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 09 Jul, 2026 | Page: 1

సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు శుభవార్త.. 10% డైట్ చార్జీల పెంపుపై ఎమ్మెల్యే గురజాల హర్షం

పేద విద్యార్థుల పోషకాహారానికి పెద్దపీట.. సీఎం నిర్ణయానికి గురజాల కృతజ్ఞతలు...

ఎనిమిది వేల మంది విద్యార్థులకు లాభం.. డైట్ చార్జీల పెంపు అభినందనీయం...

హాస్టళ్లలో నాణ్యమైన భోజనానికి ఊతం.. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే స్పందన...

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. డైట్ చార్జీల పెంపుతో మెరుగైన సౌకర్యాలు...


చిత్తూరు( జులై 09),(జ్ఞాన ప్రకాష్ చిత్తూరు జర్నలిస్ట్):రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో నివసిస్తూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరంలో 10 శాతం డైట్ చార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలను సవరించడం అవసరమని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారని చెప్పారు. చిత్తూరు జిల్లాలోనే ఎనిమిది వేల మందికి పైగా విద్యార్థులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని, మౌలిక సదుపాయాల కొరత, ఆహార నాణ్యతపై విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి హాస్టళ్లలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజనం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అనేక మంది విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై ఆధారపడి ఉన్నారని, అలాంటి వారికి ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ చర్య ఎంతో విలువైనదని ఎమ్మెల్యే అన్నారు. విద్యతో పాటు ఆరోగ్యవంతమైన జీవనానికి పోషకాహారం కీలకమని, అందుకే డైట్ చార్జీల పెంపు సమయోచిత నిర్ణయమని అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుదలతో పాటు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పలు సంస్కరణలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువును కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని డైట్ చార్జీల పెంపునకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ఊరటనిస్తుందని, విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ఇది తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
🏠 Home