హలో.. నేను మీ కలెక్టర్‌ను మాట్లాడుతున్నా!”: బీఎల్‌ఓ ఇంటికొచ్చారా?": ఓటర్లకు నేరుగా ఫోన్ చేసి వారి పని తీరుపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్!
అన్నమయ్య జిల్లా, జులై 8:
ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో చేపట్టాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు బుధవారం సోమల మండలంలోని 146వ మరియు 148వ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, హౌస్‌హోల్డ్ ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల సవరణ, నివాస మార్పులు, మరణించిన ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు.
ఈ తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినూత్నంగా పలువురు ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. బీఎల్‌ఓలు తమ ఇళ్లకు వచ్చి సర్వే చేస్తున్నారా, వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్నారా, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను నేరుగా సేకరించడం ద్వారా బీఎల్‌ఓల పనితీరును ఆయన సమీక్షించారు. సర్వే ప్రక్రియలో ప్రజల సంతృప్తి , పారదర్శకత అత్యంత కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.జిల్లాలో అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను నమోదు చేయడంతో పాటు, కొత్తగా అర్హత పొందిన వారి పేర్లను చేర్చడం, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నమోదు చేయడం, మరణించిన ఓటర్ల వివరాలను సంబంధిత ధృవీకరణ పత్రాల ఆధారంగా నిబంధనల మేరకు తొలగించాలని ఆదేశించారు.
ఓటరు జాబితా ఖచ్చితత్వమే ఎన్నికల పారదర్శకతకు పునాదని అన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో నమోదైన సవరణల వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో ధృవీకరించి సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. సేకరించిన సమాచారాన్ని ఎలాంటి జాప్యం లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ, ఈ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే, పోలీసు, ఎన్నికల శాఖల అధికారులు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
-----------------///---------------
డీఐపీఆర్వో, అన్నమయ్య జిల్లా