🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 07 Jul, 2026 | Page: 1

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఘన స్వాగతం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ ముంబై నుంచి ఇండిగో విమానంలో మంగళవారం రాత్రి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె రాకను తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేసిన నిధి అగర్వాల్, కొద్దిసేపు వారితో ఫొటోలు దిగారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరారు. ప్రముఖ సినీ నటి రాకతో విమానాశ్రయ పరిసరాల్లో సందడి నెలకొంది.
🏠 Home