🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 06 Jul, 2026 | Page: 1

రాయచోటిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం కార్యకర్తలే పార్టీకి వెన్నెముక: AICC సెక్రటరీ గణేష్ యాదవ్

రాయచోటి, ఏప్రిల్ 6: రాయచోటిలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి AICC సెక్రటరీ గణేష్ యాదవ్, PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా గణేష్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారి కృషి వల్లే పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

మస్తాన్ వల్లి మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలపై జిల్లా నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజుల భాస్కర్, పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బాల్రెడ్డి సోమశేఖర్ రెడ్డి, పీలేరు మండల అధ్యక్షుడు దుబ్బా శ్రీకాంత్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని తీర్మానించారు.
🏠 Home