🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 06 Jul, 2026 | Page: 1

జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడిగా చంద్రమౌళిని నియమించాలని విజ్ఞప్తి


చిత్తూరు(రాజనీతి),(జులై 06): చిత్తూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, చిత్తూరు పార్లమెంట్ సమాచార కమిటీ పరిశీలకులు పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకుడు చంద్రమౌళి,యశ్వంత్(డిస్ట్రిక్ట్ సెక్రటరీ ),సంతోష్ (సిటీ ప్రెసిడెంట్),అగ్రహారం వెంకటేష్, భాను ప్రసాద్(డిస్ట్రిక్ట్ సెక్రటరీ),రెడ్డిగుంట కిషోర్,పూల చందు,సోమశేఖర్ లు పార్టీకి సంబంధించిన 2036 దరఖాస్తును ఎమ్మెల్యే ధర్మరాజుకు అందజేశారు. అనంతరం చంద్రమౌళిని జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ నాయకులు ధర్మరాజును కోరారు. పార్టీ బలోపేతానికి చంద్రమౌళి సేవలు మరింత ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home