లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు తిరుపతి చేరుకున్న అక్కినేని కుటుంబం
లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, హీరో అక్కినేని అఖిల్, నటి అమలతో పాటు చిత్రబృందం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సినీ తారలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అభిమానుల కేరింతలు, ఫోటోలు, సెల్ఫీలతో విమానాశ్రయ పరిసరాలు సందడిగా మారాయి. భద్రతా ఏర్పాట్ల నడుమ చిత్రబృందం అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్డు మార్గంలో తిరుపతికి బయలుదేరింది. తిరుపతిలో జరగనున్న లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సినీ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.