అన్నమయ్య జిల్లాలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్స్..
అమరావతి // 4.7.2026
అన్నమయ్య జిల్లా మొలకలచెర్వు
మండలానికి చెందిన 6 సంవత్సరాల చంద్రిక లో కనిపిస్తున్న లక్షణాలు, కుటుంబ వైద్య చరిత్రను
వైద్యుల బృందం నిశితంగా పరీక్షించింది. తద్వారా వైద్యులు ప్రాథమికంగా Xeroderma Pigmentosum (XP) వ్యాధి అభిప్రాయపడ్డారు. అయితే, దీనిని నిర్ధారించేందుకు అవసరమైన ప్రత్యేక పరీక్షలు చేయడంతో పాటు నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందని వైద్య బృందం తెలిపినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.
చంద్రిక ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే మంత్రి శ్రీ సత్యకుమార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మీ నరసయ్య, వైద్యుల (పీడియాట్రిక్, ఆప్తమాలజిస్టు)ను హుటాహుటిన ఇంటికి పంపించారు.
ఈ సందర్భంగా వైద్యులు బాలికను పరీక్షించి ప్రాథమిక చికిత్స అందించారు. కుటుంబ వైద్య చరిత్ర (Family History) పరిశీలించగా, బాలిక మేనమామ కుమారులు కూడా ఇదే తరహా వ్యాధితో బాధపడ్డారు
ప్రాథమిక పరీక్షలో బాలిక కంటి కింది భాగంలో పుండు ఏర్పడి, చీము పట్టి, అందులో మాగెట్స్ (Maggots) ఉన్నట్లు గుర్తించారు. పుండు కంటి సమీపంలో ఉండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ చిన్నపిల్లల వైద్య నిపుణులు ప్రాథమిక చికిత్స, డ్రెస్సింగ్ చేసి అవసరమైన మందులు అందించారు.
బాలిక లక్షణాలు, కుటుంబ వైద్య చరిత్రను పరిశీలించిన అనంతరం, వైద్యులు ప్రాథమికంగా (Provisional Diagnosis) Xeroderma Pigmentosum (XP) వ్యాధి అయి ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, దీనిని నిర్ధారించేందుకు నిపుణులచే పరీక్షలు చేయించాల్సి ఉందని, ప్రత్యేక వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉందని మంత్రి శ్రీ సత్య కుమార్ కు నివేదించారు.
ప్రత్యేక వైద్య చికిత్స, నిర్ధారణ కోసం బాలికను తిరుపతి రూయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సిబ్బంది సమక్షంలో 108 అంబులెన్స్ ద్వారా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు
చేయగా, బాలిక తల్లిదండ్రులు రేపు వస్తామని చెప్పినట్లు వైద్య బృందం తెలిపింది.
బాలిక ఆరోగ్య విషయంలో అన్ని రకాల జాగ్రత్త తీసుకోవాలని మంత్రి అధికారులు, వైద్య బృందాన్ని ఆదేశించారు