ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొందాం... తక్కువ నీటి పంటలతో రైతుల ఆదాయాన్ని పెంచుకుందాం!
*తక్కువ నీటి పంటలు వేసి ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ అధికారుల సూచన*
పీలేరు ఎల్ నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడే నీటి ఎద్దడిని తట్టుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు.
పీలేరు మండలం బోడుమల్లు వారి పల్లి రైతు సేవా కేంద్రం పరిధిలోని మొరవడి పల్లి గ్రామంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, హార్టికల్చర్, అగ్రికల్చరల్, ఏపీ సీఎన్ఎఫ్, డి.ఆర్.డి.ఏ శాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీలేరు సహాయ వ్యవసాయ సంచాలకులు *కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ* ఎల్ నినో కారణంగా వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తక్కువ నీరు అవసరమయ్యే చిరుధాన్యాలు, కూరగాయలు, పప్పు ధాన్యాలను సాగు చేసి నిరంతరం ఆదాయం పొందాలని తెలిపారు.
*మండల వ్యవసాయ అధికారిణి రమాదేవి మాట్లాడుతూ*
రైతులు తుంపర, బిందు సేద్య పద్ధతులను అవలంబించాలి. నీటి ఎద్దడిని తట్టుకునే వంగడాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే ఎల్ నినో ప్రభావాన్ని సమర్థంగా అధిగమించవచ్చని సూచించారు.
*పీలేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మాట్లాడుతూ పురం రామమూర్తి*
ప్రత్యామ్నాయ పంటల సాగుతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేస్తే రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ సుకుమార్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు అమర్నాథ్ రెడ్డి, గోళ్ళ కిషోర్ నాయుడు, బాబు చిరంజీవి, అబ్బు వెంకటేష్, ఏఈఓ జహీర్, బిందు, ఎల్ నినో సిబ్బంది, సంఘమిత్రులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.