SIR కార్యక్రమంపై ప్రత్యేక అధికారి సమీక్ష... నిర్దేశిత గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు!
SIR కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అధికారి, అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ డా. కె. సుబ్రహ్మణ్యం గారు కలికిరి మండలంలోని ఎం.పి.డి.ఓ. కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని బి.ఎల్.ఓలతో సమావేశమై, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం పురోగతిని సమీక్షించారు.
మండలంలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని, ఈ నెల 14వ తేదీలోపు SIR ప్రక్రియను పూర్తిచేయాలని బి.ఎల్.ఓలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కలికిరి మండల ఎం.పి.డి.ఓ. శ్రీ పి. భానుమూర్తి గారు మరియు కలికిరి మండల తహసీల్దార్ శ్రీ ఎస్. సయీద్ అహ్మద్ గారు పాల్గొన్నారు.