🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 04 Jul, 2026 | Page: 1

మన్యం వీరుడి చిత్రపటానికి అదనపు ఎస్పీ శ్రీ యం.వెంకటాద్రి గారి ఘన నివాళి.

తేదీ:04.07.2026
అన్నమయ్య జిల్లా - మదనపల్లి
మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని శనివారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం.వెంకటాద్రి గారు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. కేవలం 27 ఏళ్ల చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అమాయక గిరిజనులను ఏకం చేసి, వారికి గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ మహావీరుడి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీ డి.ఏడుకొండల రెడ్డి, ఏఏవో శ్రీ పి.శ్రీనివాసులు, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్ఐలు ఆర్ఎస్ఐలు మరియు డీపీఓ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
👇
అన్నమయ్య పోలీస్
🏠 Home