🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 04 Jul, 2026 | Page: 1

టిబి రహిత రేపటి కోసం ఛాతీ ఎక్స్-రేలు!!


పీలేరు/తేది:03-07-26 :-ఛాతిలో క్షయ ఉధృతిని కనుగొనే "హెచ్ హెచ్ ఎక్స్ - రే " ని అందరూ సద్వినియోగం చేసుకుని టిబి రహిత ముందు తరానికి చేయూత నివ్వాలని పీలేరు టిబి నియంత్రణ విభాగ పర్యవేక్షకులు మోహన్ మరియు పవన్ కుమార్ ప్రజలను అభ్యర్థించారు.

100 దినాలు కార్యక్రమంలో భాగంగా నేడు పీలేరు పట్టణంలో ని సాయిరాం వీధి లో 108 మందికి టిబి వ్యాధి నిర్దారణకై ఎక్స్-రే లు తీయడం జరిగిందని తెలియజేశారు.
క్షయ వ్యాధి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమని, ఒక్కోసారి ఎలాంటి ప్రమాదం హెచ్చరికలు లేకుండా వచ్చే ప్రమాదముందని, కావున మనందరి ఆరోగ్య భద్రతకై 18 సంవత్సరాలు వయస్సు దాటిన అందరు "హెచ్ - హెచ్ ఎక్స్-రే" తీసుకోవాలని,ఇది మన గ్రామంలోనే మనకోసం ప్రభుత్వం కల్పించిన ఓ.. ప్రతిష్టాత్మక మొబైల్ ఎక్స్- రే విధానమని,వ్యాధి నిర్దారణ ,నియంత్రణకై సత్వర చికిత్స ముఖ్యమని పర్యవేక్షణధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీలేరు టిబి యూనిట్ పర్యవేక్షకులు మోహన్,పవన్,పిహెచ్ యన్ కుసుమ,ఏ యన్ యం భార్గవి,లక్ష్మీ,సి హెచ్ఓలు,చంద్రకళ, నాగముత్యం,సౌజన్య,ఎక్స్-రే టెక్నీషియన్ రిహానా,ఆశా కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home