🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 03 Jul, 2026 | Page: 1

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి.. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలి: కలెక్టర్

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రజలకు ప్రతిరోజూ సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెత్త పేరుకుపోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఎస్‌ఐఆర్–2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
🏠 Home