ప్రభుత్వ పాఠశాలకు గణిత ఉపాధ్యాయురాలి దాతృత్వం
పీలేరు :-స్థానిక జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు పి. ఖుదిషియా బేగం పాఠశాల,విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగర్థం ఆటోమేటిక్ బ్లూటూత్, ఎలక్ట్రానిక్ బెల్, యాంబిల్ ఫైర్, స్పీకర్ వైర్లెస్ మైక్ బహుకరించడం జరిగిందని ప్రధానోపాధ్యాయురాలు కిరణ్మయి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటోమేటిక్ బెల్ వలన ఉదయం నుండి సాయంకాలం వరకు అన్ని పీరియడ్లకు సరైన సమయంలో మ్రోగుతుందని పట్టణంలో ఏ పాఠశాలకు లేని సౌకర్యం తమ ఉర్దూ పాఠశాలకు ఇచ్చిన ఘనతగణిత ఉపాధ్యాయురాలి దాతృత్వం చేయడం హర్షించేదగ్గ విషయమని అన్నారు అలాగే గణితంలో ఖుదిసియా బేగం అనేక ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి విద్యార్థులను చదువు పట్ల ప్రోత్సహించారని తెలిపారు అంతేకాకుండా ఉర్దూ అకాడమీ నుండి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారని తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు బాబు నాయక్ పద్మావతి లు పాల్గొన్నారు