అంగన్‌వాడీలకు 70 ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ.
కె.వి.పల్లి, జూలై 1:
కె.వి.పల్లి మండలం సొరకాయలపేట గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి, చిన్నారులు మరియు గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు 70 ఇండక్షన్ స్టవ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్వైజర్ స్వర్ణ చేతుల మీదుగా అంగన్‌వాడీ టీచర్లకు స్టవ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ స్వర్ణ మరియు మండల అధ్యక్షురాలు గీతాంజలి సంయుక్తంగా మాట్లాడిన వారు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం తయారీలో ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా వంట ప్రక్రియ మరింత వేగంగా, పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంతో గ్యాస్, కట్టెలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో పాటు సమయం ఆదా కావడంతో అంగన్‌వాడీ సిబ్బందికి కూడా పనిభారం కొంత మేర తగ్గుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ స్టవ్‌ల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారాన్ని మరింత పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి అందించేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా సేవల నాణ్యత మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గీతాంజలి, గోరంట్లపల్లి మాజీ సర్పంచ్ కృష్ణయ్య, అంగన్‌వాడీ సూపర్వైజర్ స్వర్ణ, జయన్న, అంగన్‌వాడీ టీచర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పంపిణీ అనంతరం అంగన్‌వాడీ టీచర్లు ఈ సౌకర్యం కల్పించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.