🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 01 Jul, 2026 | Page: 1

రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం రేణిగుంట చేరుకున్న మంత్రి లోకేష్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు. విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై నినాదాలతో సందడి చేశారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ మధ్య లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగే సభా ప్రాంగణానికి బయలుదేరి వెళ్లారు. మార్గమంతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతూ ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పారు.
🏠 Home