🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 30 Jun, 2026 | Page: 1

రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్‌కు ఘన సన్మానం

రేణిగుంట మండల తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్‌ను మంగళవారం ఆయన కార్యాలయంలో రేణిగుంట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ నగేశం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నగేశం మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిపాలన అందిస్తూ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తే ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
🏠 Home