🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 29 Jun, 2026 | Page: 1

జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు: ఆసక్తి ఉన్న నాయకులు, కార్యకర్తలకు ఆహ్వానం - ఇన్చార్జ్ బెజవాడ దినేష్

రాజంపేట పార్లమెంటు నుంచి గ్రామస్థాయి వరకు నూతన కమిటీలు: పవన్ ఆదేశాలతో కసరత్తు

తేదీ: 29-06-2026, సోమవారం

పీలేరు: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రాజంపేట పార్లమెంటు స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నూతన కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బెజవాడ దినేష్ తెలిపారు.

ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ కమిటీల ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు.

బెజవాడ దినేష్ మాట్లాడుతూ: "పార్టీ నిర్మాణమే మన తొలి ప్రాధాన్యత. రాజంపేట పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలు వేయడం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఆసక్తి, అంకితభావం ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి."

"కమిటీల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు తమ పూర్తి వివరాలతో కూడిన సమ్మతి పత్రాలను రాజంపేటలోని పార్లమెంటు సెంట్రల్ ఆఫీస్‌లో వెంటనే సమర్పించాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పనిచేసే వారికి కమిటీల్లో తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని పిలుపునిచ్చారు.

జనసైనికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు

అందుకు సంబంధించిన దరఖాస్తులు జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బెజవాడ దినేష్, పార్లమెంటు సమాచార సేకరణ కమిటీ సభ్యులు, కలప రవి, దీపాని ప్రభాకర్, పోలి మేర రెడ్డప్ప దగ్గర అందుబాటులో కలవు.

ఈ కార్యక్రమంలో కలప రవి, దీపాని ప్రభాకర్, పొలిమేర రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.
🏠 Home