🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 29 Jun, 2026 | Page: 1

"విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా... గొర్ల ముదివీడుకు ప్రత్యేక బస్సు!"

అన్నమయ్య జిల్లా | *రాయచోటి నియోజకవర్గం
(29-06-2026)

"విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా... గొర్ల ముదివీడుకు ప్రత్యేక బస్సు!"
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం

ప్రెస్ నోట్:

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గొర్ల ముదివీడు ఉన్నత పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులు చాలాకాలంగా రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు.

విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న వెంటనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అత్యంత వేగంగా స్పందించి, సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. వారి చొరవతో గొర్ల ముదివీడు ఉన్నత పాఠశాల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయబడింది. ఇకపై ఈ బస్సు నిత్యం గొర్ల ముదివీడు మార్గంలో ప్రయాణిస్తూ విద్యార్థులకు సురక్షితమైన, సమయపాలనతో కూడిన రవాణా సౌకర్యాన్ని అందించనుంది.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు, విద్యార్థినులు ఇకపై రవాణా ఇబ్బందులు లేకుండా పాఠశాలకు చేరుకునే అవకాశం లభించింది. అదే సమయంలో గ్రామ ప్రజలకు కూడా ఈ ప్రత్యేక బస్సు ఎంతో ఉపయోగకరంగా మారింది.

ప్రత్యేక బస్సు గ్రామానికి చేరుకున్న సందర్భంగా గ్రామ ప్రజలు, విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు హర్షాతిరేకాలతో బస్సుకు పూలదండలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థుల సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న చిత్తశుద్ధి, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే నాయకత్వాన్ని కొనియాడారు.

"విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు" అనే లక్ష్యంతో పనిచేస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చొరవ మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు .
🏠 Home