🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 27 Jun, 2026 | Page: 1

రేణిగుంట సంతలో 'టిబి ముక్త్ భారత్'పై అవగాహన

ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా శనివారం రేణిగుంట వారపు సంతలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ సూపర్వైజర్ కామరాజు, సీనియర్ టిబి సూపర్వైజర్ సుమశ్రీ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీకి ఉచిత పరీక్షలు, మందులు, పోషకాహార సహాయం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్షయవ్యాధిగ్రస్తులపై వివక్ష చూపకుండా అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
🏠 Home