ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
జూలై 2న రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లి సమీపంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్, తాగునీరు, పారిశుధ్యం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కృష్ణతేజ తదితర అధికారులు పాల్గొన్నారు.