బాధితులకు అండగా CMRF చెక్కులు: పీలేరులో లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి
కలికిరి నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో చెక్కుల పంపిణీ - సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
తేదీ: 26-06-2026, శుక్రవారం
కలికిరి: వివిధ ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పీలేరు నియోజకవర్గ బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శుక్రవారం అందజేశారు.
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం నగిరిపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి చికిత్స పొందిన వారికి CMRF ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.
23చెక్కులకు గాను 17లక్షల 25వేల 781రూపాయలు బాధిత కుటుంబాలకు అందజేశారు.
చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ప్రభుత్వం, ఎమ్మెల్యే మాకు అండగా నిలిచారు. ఈ సహాయం మా కుటుంబాలకు ఎంతో ఊరట నిస్తుందని లబ్ధిదారులు భావోద్వేగానికి గురయ్యారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బాధిత కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.