🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 26 Jun, 2026 | Page: 1

ముస్లిం సోదర సోదరీమణులకు మొహరం పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి

ముస్లిం సోదర సోదరీమణులకు మొహరం పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి

త్యాగానికి ప్రతీక మొహరం - మత సామరస్యానికి నిదర్శనంగా జరుపుకోవాలి

పీలేరు:త్యాగానికి, సత్యానికి ప్రతీక అయిన మొహరం పండుగను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. మొహరం పండుగ సందర్భంగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ: "మొహరం పండుగ ధర్మం కోసం, న్యాయం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకునే పవిత్ర దినం. ఇమామ్ హుస్సేన్ త్యాగం యుగయుగాలకు స్ఫూర్తిదాయకం.

పీలేరు నియోజకవర్గంలో హిందూ, ముస్లిం సోదరులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి అన్ని పండుగలు జరుపుకుంటున్నారు. ఇదే సామరస్యం, ఐక్యత ఎప్పటికీ కొనసాగాలి. మొహరం పండుగను శాంతియుత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని కోరుతున్నానని అన్నారు.

ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
🏠 Home