🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 25 Jun, 2026 | Page: 1

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి... సిఐ మంజునాథ్ రెడ్డి

యువత దేశ భవిష్యత్తు అని, విద్యార్థి దశలో సరైన అవగాహనతో ముందుకు సాగితే సమాజం అభివృద్ధి చెందుతుందని రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి సూచించారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీబీఆర్ కళాశాలలో ఈగిల్ ఇన్‌స్పెక్టర్,ఎస్‌ఐ హరీష,పోలీసు బృందం మాదకద్రవ్యాల నివారణ, సైబర్ నేరాల అవగాహన, శక్తి యాప్ వినియోగంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు. సోషల్ మీడియా, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని సమాజానికి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సిఐ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని, ఎలాంటి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులు, ఫేక్ జాబ్ ఆఫర్లు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ అత్యవసర సమయంలో యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణ, చట్టాలపై అవగాహనతో ముందుకు సాగి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home