మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన-అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ.
తేదీ: 24 -06-2026
మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన
- రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలు, మహిళల రక్షణపై సూచనలు.
- అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానం, టోల్‌ఫ్రీ నంబర్లపై వివరాలు.
- అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ దిరాజ్ కునుబిల్లి ఐపీఎస్ సర్ అదేశాలమేరకు సుంకు కళాశాల యందు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు పాల్గొని భద్రతకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై అవగాహన పొందారు.
- ఈ సమావేశంలో ముఖ్యంగా రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మహిళల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై పోలీసు అధికారులు సమగ్రంగా వివరించారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని హాజరైన వారికి తెలియజేశారు.
- అదేవిధంగా, మహిళలు ఎలాంటి ఆపద పరిస్థితులు ఎదురైనప్పటికీ భయపడకుండా వెంటనే స్పందించి సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాల్సిన విధానం గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన టోల్‌ఫ్రీ నంబర్లు, పోలీసు సహాయ సేవల వివరాలను కూడా సమావేశంలో తెలియజేశారు.
- మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, అప్రమత్తతతో వ్యవహరించడం ద్వారా అనేక నేరాలను ముందుగానే నివారించవచ్చని అధికారులు సూచించారు. శక్తి app ఉపయోగించే పద్దతి పై అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో B కొత్తకోట Ci గోపాల్ రెడ్డి,శక్తి టీం మదనపల్లి మునికుమార్ నాయిక్, వీణ కుమారి, కళాశాల ప్రిన్సిపాల్ మంజునాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు