భూలోక తండ్రి ఆలింగనంలో ఆవిష్కృతమైన పరలోక తండ్రి ప్రేమ
తప్పిపోయిన కుమారుడిని చేర్చుకున్న తండ్రి... పరలోక ప్రేమకు ప్రతిరూపం
బైబిలులో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలలో “తప్పిపోయిన కుమారుని ఉపమానం” అత్యంత హృదయస్పర్శిగా నిలుస్తుంది. ఈ ఉపమానం ద్వారా దేవుని అపారమైన ప్రేమ, క్షమాగుణం, కరుణ, సహనాన్ని మనం తెలుసుకోవచ్చు.
ఒక ధనవంతునికి ఇద్దరు కుమారులు ఉండేవారు. వారిలో చిన్న కుమారుడు తనకు రావలసిన ఆస్తి వాటాను ముందుగానే తీసుకుని, దూర దేశానికి వెళ్లి వ్యర్థమైన జీవన విధానంలో తన ఆస్తి మొత్తాన్ని వృథా చేశాడు. కొంతకాలానికి ఆ దేశంలో తీవ్రమైన కరువు రావడంతో అతడు ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. చివరకు పందులను మేపే దుస్థితికి చేరుకొని, తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితిని ఎదుర్కొన్నాడు.
అప్పుడు అతడు తన తప్పును గ్రహించాడు. “నా తండ్రి ఇంటిలో పనివారికైనా సమృద్ధిగా ఆహారం ఉంది. నేను తిరిగి వెళ్లి నా తప్పును ఒప్పుకుంటాను” అని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన తండ్రి వద్దకు బయలుదేరాడు.
దూరం నుంచే తన కుమారుడిని చూసిన తండ్రి అతనిపై కనికరించి, పరుగెత్తి వెళ్లి కౌగిలించుకున్నాడు. కుమారుడు తన పాపాన్ని ఒప్పుకున్నప్పటికీ, తండ్రి అతన్ని తిరస్కరించలేదు. అతనికి ఉత్తమ వస్త్రాలు ధరింపజేసి, విందు ఏర్పాటు చేసి ఆనందించాడు.
ఈ ఉపమానం ద్వారా యేసుక్రీస్తు ఒక గొప్ప సత్యాన్ని బోధించారు. మనిషి ఎంత దూరం దేవుని నుండి వెళ్లిపోయినా, తన తప్పును గ్రహించి పశ్చాత్తాపంతో తిరిగి వస్తే దేవుడు అతన్ని ప్రేమతో స్వీకరిస్తాడు. దేవుని దృష్టిలో పశ్చాత్తాపపడిన ఒక్క పాపి కూడా అమూల్యుడే.
నేటి సమాజంలో అనేక మంది భౌతిక ఆశలు, స్వార్థ ప్రయోజనాల కోసం దేవుని మార్గం నుండి దూరమవుతున్నారు. అయితే ఈ ఉపమానం మనకు ఆశను కలిగిస్తుంది. దేవుని ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఆయన క్షమ ద్వారం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది.
ఫాదర్స్ డే సందర్భంగా ఈ ఉపమానం ప్రతి తండ్రికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రేమతో, సహనంతో, క్షమతో తమ పిల్లలను నడిపించే తండ్రులు కుటుంబాలకు ఆశీర్వాదమవుతారు. తప్పిపోయిన కుమారుడిని ఆలింగనం చేసిన తండ్రిలా, ప్రతి తండ్రి తన కుటుంబానికి ప్రేమకు, రక్షణకు, ఆదరణకు ప్రతీకగా నిలవాలి.
మన జీవితంలో ఎలాంటి తప్పులు జరిగినా, నిరాశ చెందకుండా దేవుని వైపు తిరిగి రావడం అవసరం. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడిని ఆలింగనం చేసిన తండ్రిలా, దేవుడు కూడా ప్రతి పశ్చాత్తాప హృదయాన్ని ప్రేమతో స్వాగతిస్తాడు.
“తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషించినట్లే, పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగే ప్రతి మనిషి విషయంలో పరలోకంలో ఆనందం కలుగుతుంది.”
(లూకా సువార్త 15:11-32)
Ammiti Sunil Milton
CSI Deenulaalayamu, Kalikiri.