🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 20 Jun, 2026 | Page: 1

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు

రేణిగుంట మండలంలోని చెంగారెడ్డిపల్లి గ్రామంలో శనివారం జరిగిన విషాద ఘటనలో విద్యుత్ షాక్‌కు గురై ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా శాంతినగర్‌కు చెందిన ఎం. చంద్రశేఖర్ తన భార్య కృష్ణవేణి (28)తో కలిసి నిర్మాణ పనుల కోసం రేకుల షెడ్లు ఏర్పాటు చేస్తూ కూలి పనులు చేస్తున్నారు. ఉదయం నీటి మోటారు ఆఫ్ చేయడానికి వెళ్లిన కృష్ణవేణి తిరిగి రాకపోవడంతో వెతకగా మోటారు సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
🏠 Home