🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 20 Jun, 2026 | Page: 1

5 కేసులు పెడితే చాలు వైసీపీ ఖాళీ పీలేరు సభలో MLA నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

5 కేసులు పెడితే చాలు వైసీపీ ఖాళీ

పీలేరు సభలో MLA నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


విధ్వంసం నుండి వికాసానికి కూటమిపాలనతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు

తల్లికి వందనం నుండి అన్నదాత సుఖీభవ వరకు ప్రతి ఇంట సంక్షేమ కాంతులు

అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తాం

పీలేరు జూన్ 19 రాజనీతి


నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల్ని లొంగదీసుకోవాలని గత వైసీపీ ప్రభుత్వం 160 మంది పై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసింది. అయినా ఒక్క కార్యకర్త కూడా వైసీపీ పార్టీలోకి వెళ్లలేదు. అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొని పార్టీకి అండగా నిలిచి అధికారాన్ని అందించారని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు.

అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన "రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం - సూపర్ సిక్స్ సూపర్ హిట్" విజయోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కేవలం ఐదు కేసులు పెడితే చాలు పీలేరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ అలాంటి కక్ష సాధింపు చర్యలు,స్వభావం కూటమి ప్రభుత్వానికి లేదని మేము ప్రజాబలంతోనే గెలవాలని నమ్ముతాం. నిజాయితీ రాజకీయాలతోనే ముందుకు పోతున్నామని ఆయన పేర్కొన్నారు.

వైసీపీ నాయకులకు అభివృద్ధి అంటే తెలియదని, 'దోచుకో దాచుకో' విధానంతో రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో యువతీ యువకులకు, నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.

విధ్వంసం నుండి వికాసానికి... శిథిలాల నుంచి శిఖరాలకు... నవ్యాంధ్ర నుంచి స్వర్ణాంధ్రకు రెండేళ్ల కూటమిపాలన తీసుకెళ్లిందని నిండైన సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిరునామాగా నిలిచి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ఎమ్మెల్యే అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.

వైసీపీ అక్రమ కేసులకు భయపడని కార్యకర్తలే మన బలం. అలాంటి కార్యకర్తల త్యాగాలతో వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకుందాం. ప్రజలకు సేవ చేసే చంద్రబాబు పాలనకు, కూటమి పార్టీకి అండగా నిలబడదామని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు, సింగల్ విండో అధ్యక్షులు, నియోజకవర్గ కూటమి నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు అనుబంధ సంఘాలు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, అనధికారులు, మహిళలు, కార్యకర్తలు నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home