🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 19 Jun, 2026 | Page: 1

ఆహార నాణ్యతలో రాజీ లేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డాక్టర్ యువ అన్వేష్

తిరుపతి నగరంలో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాల అమలుపై నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో ప్రముఖ రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టగా, కొన్ని కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణ లోపాలు గుర్తించారు. భవానీనగర్, ఎయిర్ బైపాస్ రోడ్డులోని రెండు కేఎఫ్‌సీ కేంద్రాల్లో సుమారు 1,367 కిలోల చికెన్ అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే చర్యలను సహించబోమని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.
🏠 Home