జూన్ 21 యోగాంధ్రను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న ఎస్వీ యూనివర్సిటీ తారకరామారావు స్టేడియంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన ఆయన, కనీసం 10 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరం, పార్కింగ్, భద్రత, విద్యుత్, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాంధ్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.