సీఎం – డిప్యూటీ సీఎం రాష్ట్రానికి రెండు కళ్ళు : జనసేన నేత నాగరాజు
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు కళ్లలాంటివారని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు అన్నారు. శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి ఎన్‌డీఏ కూటమి విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా జరిగింది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ చర్యలు, ప్రజా పాలనపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ కొట్టే సాయి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ హాజరై కూటమి ప్రభుత్వ పాలనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రేణిగుంట మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర నిర్మాణంలో ఇద్దరు నాయకత్వం కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కూటమి నాయకులు ఐక్యంగా పనిచేస్తూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి, సీనియర్ నాయకులు త్యాగరాజు, నాయకులు మునికృష్ణ, సలీం, జనసైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.