🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 19 Jun, 2026 | Page: 1

అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన దేవస్థానం ఉద్యోగి కుటుంబం

శ్రీకాళహస్తి పట్టణంలోని వాటర్ హౌస్ కాలనీలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదం ఓ పేద కుటుంబాన్ని వీధిన పడేసింది. శ్రీకాళహస్తి దేవస్థానంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న సెల్వి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. కూతురు వివాహం కోసం దాచుకున్న రూ. లక్ష నగదు, ఐదు సవర్ల బంగారం, అర కిలో వెండి, ఫర్నిచర్, పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం, దేవస్థానం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
🏠 Home