🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 18 Jun, 2026 | Page: 1

ఆహార భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: కమిషనర్ శారదా దేవి

తిరుపతి నగరంలో ప్రజారోగ్యానికి హాని కలిగించే ఆహార వ్యాపార సంస్థలపై ఎలాంటి రాజీ ఉండదని నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మాంసం–చేపల విక్రయ కేంద్రాలు పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కుళ్లిన, గడువు ముగిసిన ఆహార పదార్థాల నిల్వ, విక్రయాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధమన్నారు. ఆకస్మిక తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తిస్తే ఆహార స్వాధీనం, ట్రేడ్ లైసెన్స్ రద్దు, సంస్థల మూసివేతతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
🏠 Home