పెళ్లకూరు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సి. వేణయ్యకు
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా బాధ్యతలు స్వీకరించిన సి. వేణయ్యకు వీఆర్వో అసోసియేషన్ తిరుపతి డివిజన్ అధ్యక్షుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జి. చెంగల్రాయులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెంగల్రాయులు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, సేవాభావంతో పనిచేసే అధికారిగా వేణయ్య మంచి గుర్తింపు తెచ్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో సమర్థవంతంగా పనిచేసి ఆదర్శ అధికారిగా నిలవాలని ఆకాంక్షించారు.