🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 17 Jun, 2026 | Page: 1

గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని

రామచంద్రపురం మండలం రామాపురంలో ఘనంగా నిర్వహించిన గంగమ్మ తల్లి జాతరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల నాయకులు, గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు విచ్చేసిన ఎమ్మెల్యేకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో ఉండేలా గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రసాదించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
🏠 Home