🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 17 Jun, 2026 | Page: 1

రైతులకు ఎరువుల పంపిణీ మార్గదర్శకాల గోడ పత్రిక ఆవిష్కరణ

కడప జూన్ 17 రాజనీతి: కడప జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన మార్గదర్శకాల గోడ పత్రికలను బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సవిత,శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎరువుల పంపిణీ పారదర్శకంగా,సమర్థవంతంగా జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలపై రైతులు అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి,శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి,పుట్టా సుధాకర్ యాదవ్,పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి,జిల్లా కలెక్టర్,వ్యవసాయ శాఖ అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home