🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 17 Jun, 2026 | Page: 1

సవాళ్లు కాదు.. ప్రజా సమస్యలపై పోరాటం చేయండి: ధ్రువకుమార్

వేంపల్లె జూన్ 17 రాజనీతి : గత వారం రోజులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి,వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సవాళ్లు,ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారని, వీరికి ఏమాత్రం ప్రజా సమస్యలపై శ్రద్ధ ఉందా అని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జీ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం వేంపల్లెలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. "బీటెక్ రవి, అవినాష్ రెడ్డిలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి గురించి వీరికి ఏమాత్రమైన శ్రద్ధ ఉందా?" అని ప్రశ్నించారు.
మెడికల్ కాలేజీ,జగనన్న కాలనీలపై పోరాడండి:
పులివెందులలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంపై,జగనన్న కాలనీలపై,ఆయా ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన వీరు ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై,గ్రామ పంచాయతీల్లో నెలకొని ఉన్న పారిశుధ్య,తాగునీటి సమస్యలపై పోరాడాలని సూచించారు. చేతకాని పక్షంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుబ్రమణ్యం,రామాంజనేయులు రెడ్డి,రవీంద్రారెడ్డి,అమర్నాథరెడ్డి,ఉత్తన్న,వేమారాజా,వెంకటేష్,బద్రీనాథ్,రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home