🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 16 Jun, 2026 | Page: 1

తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసుల వెతుకులాట

పీలేరు : అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణ పరిధిలో నివసిస్తున్న లక్కె నాగిరెడ్డి (38) అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీ (02-06-2026) నుండి కనిపించకుండా పోయినట్లు పీలేరు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్. రాజు కుమారుడైన లక్కె నాగిరెడ్డి, జూన్ 2న ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో పీలేరు మండలంలోని ఎల్లమండ క్రాస్ వద్ద నుండి కుటుంబ సమస్యల కారణంగా ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను తిరిగి రాకపోవడంతో అతని భార్య లక్కె అంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు పీలేరు పట్టణంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో విస్తృతంగా గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు.
పేరు: లక్కె నాగిరెడ్డి
వయస్సు: 38 సంవత్సరాలు
తండ్రి పేరు: ఎల్. రాజు
కావున, పై ఫొటోలో/వివరాల్లో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తించినా, లేదా అతని గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పీలేరు సీఐ (CI) మొబైల్ నంబర్: 9440796744 కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
🏠 Home