🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 15 Oct, 2026 | Page: 1

ఆపదలో ఉన్నవారికి అండగా లయన్స్ క్లబ్

చిత్తూరు(రాజనీతి):చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ సభ్యులు ప్రతిరోజూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు అండగా నిలుస్తూ సేవాభావంతో తమ వంతు సహకారం అందిస్తున్నారు. సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ, ఆపదలో ఉన్నవారికి తోడుగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సామాజిక బాధ్యతను చాటుకుంటున్న లయన్స్ క్లబ్ సభ్యుల కృషి ప్రశంసనీయం.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ట్రెజరర్ శ్రీనివాసులు రెడ్డి, అధ్యక్షుడు రెడ్డప్ప, మల్లికార్జున, రమేష్, రమణారావు, బి.ఈ. శివకుమార్ పాల్గొన్నారు.
🏠 Home