🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 15 Oct, 2026 | Page: 1

మహిళలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు: డా. శ్రీ గిరీష

పీలేరు అక్టోబర్ 15 (రాజనీతి): రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని ప్రధాన వైద్యాధికారి డా. శ్రీ గిరీష తెలిపారు. గూడరేవుపల్లిలో రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసోత్సవాల్లో భాగంగా మహిళలకు అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. రొమ్ము ఆకారంలో మార్పులు, గడ్డలు, వాపు, ఎర్రదనం, రక్తం లేదా ఇతర ద్రవాల స్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు అలవర్చుకోవాలని డిప్యూటీ హెచ్‌ఈఓ కొండయ్య సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం కృష్ణమ్మ, సీహెచ్‌ లావణ్య, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
🏠 Home