🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 15 Oct, 2026 | Page: 1

నడిరోడ్డుపై వ్యక్తి బైఠాయింపు.. ట్రాఫిక్‌కు అంతరాయం

రేణిగుంట అక్టోబర్ 15 (రాజనీతి): రేణిగుంట–తిరుపతి రహదారిలోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి నడిరోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మతిస్థిమితం లేని వ్యక్తిగా భావిస్తున్న అతడిని స్థానికులు రోడ్డు పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేక రోడ్డుపై కూర్చున్నాడా, మద్యం మత్తులో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. రద్దీగా ఉండే రహదారిపై ఇలాంటి ఘటనతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
🏠 Home