38 ఏళ్ల పార్టీ సేవకు గుర్తింపు ఎక్కడ?కజూర్ బాలాజీ సతీమణి టి.యం. ద్రాక్షాయనికి మేయర్ పదవి ఇవ్వాలి.. ప్రజల విజ్ఞప్తి...
చిత్తూరు(రాజనీతి): తెలుగుదేశం పార్టీ కోసం 38 ఏళ్లుగా అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ సేవలను గుర్తించి ఆయన సతీమణి టి.యం. ద్రాక్షాయనికి మేయర్ పదవి అవకాశం కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీకి నిబద్ధతతో సేవలందించిన నాయకుల కుటుంబాలకు సముచిత గుర్తింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు.పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వెన్నంటి నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకుల సేవలను గుర్తించడం నాయకత్వ బాధ్యత అని వారు అభిప్రాయపడుతున్నారు. 38 ఏళ్లుగా ఒకే పార్టీని నమ్ముకుని పనిచేసిన కజూర్ బాలాజీ సేవలను పరిగణనలోకి తీసుకుని, ఆయన కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
కష్టపడిన నాయకుల కుటుంబాలకు గుర్తింపు ఇవ్వాలి....
పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకులకు పదవుల కేటాయింపులో ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకుల సేవలను గుర్తించడం ద్వారా కార్యకర్తల్లో మరింత ఉత్సాహం, నమ్మకం పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.
ద్రాక్షాయనికి మేయర్ పదవి అవకాశం కల్పించాలి...
కజూర్ బాలాజీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, తెలుగుదేశం పార్టీతో ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకుని టి.యం. ద్రాక్షాయనికి మేయర్ పదవి అవకాశం కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన నాయకుల సేవలకు తగిన గుర్తింపు లభించాలని కోరుతున్నారు. ఈ విజ్ఞప్తిపై టీడీపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి.