🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 12 Oct, 2026 | Page: 1

అక్రమ బైండోవర్లపై హైకోర్టుకు వెళ్తాం

పీలేరు అక్టోబర్ 12 (రాజనీతి): ఎన్నికల పేరుతో పోలీసులు చట్టవిరుద్ధంగా బైండోవర్లు చేస్తున్నారని సీపీఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టి.ఎల్‌. వెంకటేష్‌ ఆరోపించారు. నేర చరిత్ర లేని రైతులు, కూలీలు, యువకులు, న్యాయవాదులు, రాజకీయ కార్యకర్తలను బైండోవర్‌ జాబితాలో చేర్చి భయపెడుతున్నారని విమర్శించారు. చట్టప్రకారం విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అక్రమ బైండోవర్లను నిలిపివేసి, ఇప్పటికే చేపట్టిన వాటిని సమీక్షించాలని కలెక్టర్‌, ఎస్పీని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
🏠 Home