జిల్లావ్యాప్తంగా దసరా సెలవులు అమలు చేయాలి
పీలేరు అక్టోబర్ 12 (రాజనీతి): అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దసరా సెలవులు అమలు చేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ డిమాండ్ చేశారు. సెలవుల్లో తరగతులు, ప్రత్యేక కోచింగ్లు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్, డీఈఓ, ఆర్ఐఓ స్పందించి తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.