🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 12 Oct, 2026 | Page: 1

బాలికల ఉజ్వల భవిష్యత్తుకు చేయూతనిద్దాం

పీలేరు అక్టోబరు 12 (రాజనీతి): బాలికల సంక్షేమం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తలుపుల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ నాయక్ అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కావాలిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ బాలికలకు సమాన హక్కులు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, రక్షణ కల్పించాలని సూచించారు. వారి లక్ష్యాల సాధనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home