🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 11 Oct, 2026 | Page: 1

జిల్లా నంబర్‌ వన్‌.. రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంక్‌.. గురజాల జగన్‌మోహన్‌కు కజూర్ బాలాజీ అభినందనల జల్లు!

చిత్తూరు (రాజనీతి): ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తూ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ మరోసారి ప్రత్యేక గుర్తింపు సాధించారని టీడీపీ సీనియర్‌ నాయకుడు కజూర్‌ బాలాజీ పేర్కొన్నారు. మూడ్‌ ఆఫ్‌ ఏపీ–చాణక్య స్ట్రాటజీస్‌ సర్వేలో ఆయన జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు, రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు.ప్రజల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం వంటి అంశాల్లో ఎమ్మెల్యే చూపుతున్న చొరవకు ఈ ర్యాంకులు గుర్తింపుగా నిలుస్తున్నాయని కజూర్‌ బాలాజీ అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలో అగ్రస్థానాన్ని, రాష్ట్రస్థాయిలో ఏడో స్థానాన్ని సాధించడం చిత్తూరు నియోజకవర్గానికి గర్వకారణమన్నారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత బాధ్యతతో పనిచేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ప్రజాభిమానాన్ని చూరగొంటూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌కు కజూర్‌ బాలాజీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home