🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 11 Oct, 2026 | Page: 1

రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు.. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌కు రోజా చౌదరి అభినందనలు!...

చిత్తూరు (రాజనీతి): ప్రజాసేవలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించడం పట్ల చిత్తూరుకు చెందిన సివా అవార్డు గ్రహీత, టీడీపీ వీరాభిమాని రోజా చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆమె హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడంలో ప్రజాప్రతినిధుల కృషి కీలకమని రోజా చౌదరి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించడం చిత్తూరు నియోజకవర్గానికి గుర్తింపు తీసుకొచ్చే విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత బాధ్యతతో సేవలందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ చిత్తూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని గురజాల జగన్ మోహన్‌ను కోరారు. రాష్ట్రస్థాయిలో ఆయన సాధించిన గుర్తింపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మరోసారి అభినందనలు తెలిపారు.
🏠 Home