🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 10 Oct, 2026 | Page: 1

ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి

పీలేరు అక్టోబర్ 10 (రాజనీతి): ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందని ఆరోపిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం పీలేరు అంబేద్కర్‌ సర్కిల్‌లో నిరసన చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి టి.ఎల్‌. వెంకటేష్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు దుబ్బా శ్రీకాంత్‌ బాబు డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో పేదలు, దళితులు, మైనారిటీల ఓట్లు తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కవితారెడ్డి, ఇరగన్న, దాము, మల్లెల రెడ్డి, భాష, ఇస్మాయిల్‌, బోయకొండ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home